Total Pageviews

Thursday, January 5, 2017

ఉప సెంటినెల్ ఐలాండ్ "సిక్కోలు " కష్టాలు తీరేదెన్నడు ?

కేవలం జ్వరాలతో వేల మంది ప్రతి ఏడు చనిపోవడం , రక్షిత నీరు అంటే తెలియని డజన్ల మండలాలు , పెద్ద ఆసుపత్రి అంటే తెలియని లక్షల మంది జనం ... ఇవన్నీ వింటుంటే ఎదో ఆఫ్రికన్ దేశం గురించో లేదా ఇంకా నాగరికత చేరని సెంటినెల్ ఐలాండ్ గురించో  అనుకుంటున్నారు కదా ! కానీ దు:ఖిచాల్సిన విషయం ఏంటంటే ఇది అభివృద్ధి ర్యాంక్స్ లో దూసుకెళ్తున్నట్టుగా   చెప్పబడుతున్న ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న "సిక్కోలు " గురించి . అవును !


ఒక స్పిన్నింగ్ మిల్ లోనో ఫ్యాక్టరీ లోనో  ఉద్యోగం వస్తేనే పొంగిపోవాల్సిన అవసరం అండ్ అమాయకత్వం నిండిన జనం ... లేదా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ..కాదు కాదు బర్మా నుంచి దుబాయ్ వరకు వలసవెళ్ళైనా కూలిగానో ఉప బానిస గానో పని చేసుకుని బ్రతకడం తప్ప మరో మార్గం లేని దయనీయ స్థితి ఇంకా ఉన్నాయంటే నమ్ముతారా ?

"అవుట్ డేటెడ్" కాబట్టి లేక లాభాలు రావట్లేదని గత 2-3 ఏళ్లలో చాల వరకు ఫ్యాక్టరీలని ప్రభుత్వం మూసేసింది . 20 వేలమంది పైగా  ఉపాధి కోల్పాయారు ...ఉద్యమాలు నడుస్తున్నాయి . 

ఈమధ్యే వార్తల్లో ఉన్న "ఉద్దానం కిడ్నీ బాధితులు " లాంటి సమస్యలు అక్కడ వేలమందిని దశాబ్దాలుగా పీడిస్తున్నవే !అక్షరాస్యతలో క్రింది ర్యాంకులలో పోటీ పడుతూ , సరైన సౌకర్యాలు లేని పాఠశాలలతో ఇంకా ఎంతో మంది నాణ్యమైన చదువుకు దూరం. 

మాంగనీస్ , బీచ్ సాండ్ , గ్రానైట్ లాంటి వనరులు ఉన్నా, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు , జీడిపప్పు యూనిట్స్  ఉన్నా , 193 కిలోమీటర్ల  తీరం ఉన్నా  ఆక్వా రంగం అభివృద్ధికి  ప్రభుత్వం చొరవ చూపక  నిధులు ఇవ్వక పోగ  పైగా ఈ పరిశ్రమలు ఉన్న అన్ని భూముల్ని తీసుకుని పర్యావరనాన్ని గోరంగా దెబ్బతీసే విధంగా దగ్గర దగ్గరగా 5 పవర్ ప్లాంట్స్ , యురేనియం ప్లాంటు వాటికీ బలికాబోతు ఆదాయ మార్గాలు సృష్టించ బడక ప్రతి పట్టణం లో, నగరం లో వలస కూలీలు వారై ఉంటున్న సిక్కోలు వాసుల కష్టాలు తీరేదెన్నడు?

( ఈ సందర్భంలో శ్రీకాకుళం కి ఎంతో కొంత చేసిన గౌతు లచ్చన్న మరియు ఎర్రన్నాయుడు వంటివారిని గుర్తుచేసుకోవటం కూడా మన బాధ్యత . వారికి నా అభివందనం )

--గోపి గండి