Total Pageviews

Thursday, January 4, 2024

45 years industry !

"ఏంటి బ్రో అంత మాట అనేసావ్" అన్నారు కొందరు ..."ఎందుకు బ్రో ఎం హేండిల్ చెయ్యలేదు"  అన్నారు ఇంకొందరు .  నేను యదాలాపంగానో పాసింగ్ రిమార్క్ గానో చెప్పలేదు 😊
35  ఏళ్ళ క్రితం తో  మొదలెడితే ..."ఆయన్ని లేపేయద్దు " అని ఇంటలిజెన్స్ తో మొదలు పెట్టి తన కోటరీ వరకు అందరు నెత్తి నోరు మొత్తుకుని చెప్పారు మన 45 ఇయర్స్ ఇండస్ట్రీ కి ! 
మహా అయితే 6 -15 నియోజకవర్గాల్లో అతని వల్ల మనం ఓడిపోవచ్చు కానీ మన పెద్దాయనని ఇప్పటికి ఆ పెద్ద సమూహం అంతా దేవుడు లాగే చూస్తారు , సో లేపకుండా వేరే ఒప్షన్స్ అఫ్ సప్రెస్సింగ్ ఏ బెటర్ అని చెప్పినా "లేపేద్దాం" అనే డెసిషన్ 80% మన 45 ఇయర్స్ ఇండస్ట్రీ దే అండ్ 20% ఆత్మహత్య చేసుకున్న గుంటూరు జిల్లా పెద్దమనిషిది . పైన పెద్దాయనకి పూర్తిగా తెలీదు పాపం !
ఇంపాక్ట్ : 20+ %  vote share ఆల్మోస్ట్ పెర్మనెంట్ గ దూరం అయింది , కాంగి ఎప్పటికి మళ్ళి రాదు అనుకున్నది మళ్ళి వచ్చింది . లైఫ్ టైం డామేజీ !
నక్సల్ సమస్య ఎలా హేండిల్ చెయ్యకూడదో బెస్ట్ కేసు స్టడీ మన 45 ది  అయితే ఎలా హేండిల్ చెయ్యాలో దివంగత నేతది.. కుక్కని కొట్టే ముందు పిచ్చి కుక్క అనే ముద్ర సక్సెస్ఫుల్ గ ఇంప్లిమెంట్ చేసాడు   (వాస్తవానికి వాచ్ డాగ్ ఆ ..లేక వేరేనా అనేది పెద్ద చర్చ , రాస్తే ఇదే ఒక పెద్ద యస్సే  అవుద్ది )
కేంద్రీకృత అభివృద్ధి - కనీసం 10 రెప్రెసెంటేషన్స్ నివేదికలు ఇచ్చింటారు దీని మీద . తమిళనాడు లో టయర్ 2 తో టయర్ 3 సిటీస్ లో కూడా IT ఎలా ఉంది, కర్ణాటక లో కూడా ...కానీ ఇక్కడ? ఇప్ప్పటి  రాష్ట్ర  దుస్థితికి అది కూడా ఒక కారణం . . 
"పోటు" క్రైసిస్ - ప్రత్యర్ధులు వెన్నుపోటుగా పిలిచే దాన్ని ఎఫెక్టివ్ గ హేండిల్ చేసాడు మాస్టర్ మైండ్ అని కొంత మంది అనుకుంటుంటారు . నిజానికి ఎంతటి  అదృష్టం అంటే ఆ పార్టీ  పెట్టిన పెద్ద మనిషి చనిపోకపోతే నెక్స్ట్ ఎలక్షన్ పరిస్థితి ఆలోచించండి 😊 ? 
అంతే కాదు ఇంకో చాలా అంటే చాలా ముఖ్యమైన ఫాక్టర్ బీజేపీ అండ్ అటల్ బిహారి వాజపేయి . 1998 లో AP లో బీజేపీ కి సోలో గ వచ్చిన వోట్ షేర్ 18.3% , 1999 కార్గిల్ తర్వాత అది ఇంకా అమాంతం పెరిగింది. అవన్నీ 1999 లో కాంగి వైపు జనం వెళ్లకుండా ఉండటమే కాకుండా , ఈయనికి వచ్చి చేరి , ఈయన్ని రెండో సారి వచ్చేలా చేసాయి . 
ఇవి నా సొంత మాటలు కావు...మన పెద్దమనిషే తమ పార్టీ ఇంటర్నల్ "బ్యూరో" లో స్పష్టంగా  చెప్పాడు అండ్ కనీసం ఒక 15 మంది లీడర్స్ ఈ విష్యం ఇంటర్వూస్ లో చెప్పారు , లేదా అపుడే దివంగత నేత వచ్ఛేసేవాడు. 
హ్యాండ్లింగ్ అఫ్ కోర్ ఇష్యూస్  అఫ్ సెపరేట్ స్టేట్ మూవ్మెంట్ : వాటర్  ప్రాజెక్ట్స్ మీద అసలు డబ్బు పెట్టకుండా ఉండటం తో మొదలు పెట్టి అసలు ఏ కోర్ కారణాన్ని అడ్రస్ చె య్యకుపోగా ..నేను  చేస్తే ఏదైనా అణిగి పొద్ధి అన్న ఫీలింగ్ తో "ఆ పదాన్నే బాన్ " చేస్తా అని వింత పోకడ...సో ఇంకా రైజ్ అయింది 
PRP సప్రెషన్  : అప్పటి వరకు రాష్ట్రం చూడని "సంక్షేమం " అని మేజర్ ఫాక్టర్ తో అవతల జైగాన్టిక్  ఇమేజ్ తో + డెలిమిటేషన్ తో PRP ఓట్లు ముక్క చెక్కలు చెయ్యటం లాంటివి, చాలా చోట్ల "కే. చిరంజీవి " లను నిలబెట్టటం , గోదావరి జిల్లాల్లో ఇంటింటి హారతి కర్పూర ప్రమాణాలు 😆ఇలా  దివంగత చేసుండక పోతే  , తన చేతిలో ఉన్న మీడియా తో ఎన్ని కుట్రలు మన 45 చేసినా సరే PRP 50 + లో ఉండేది( 3000-4000 ఓట్ల డిఫరెన్స్ తో ఓడిపోయినవి 33) ...సో దాని మేజర్ క్రెడిట్ ఈయనిది కాదు .
భ్రమరావతి గానే మిగల్చటం : "నెక్స్ట్ మనమే వస్తాం అని లేదు ...జియో  టాగింగ్ చేసి , అఫిషియల్ గ కార్పొరేషన్ చేసి రాష్ట్రపతి స్టాంప్ వేపించేయండి సార్ " అని బ్రతిమాలారు, కానీ వినలేదు  ! "ఎంపీపీ  లను పోగొట్టు కోవటం ఎందుకు , అయినా నెక్స్ట్ మనమే వచ్చేది అపుడు చూడు ఎంత బాగా చేస్తానో.. ఇది పూర్తి చెయ్యటానికి మనమే రావాలి అని ఫీలింగ్ ఉంచాలిగా" అంటూ ఉన్నారు ...ఇపుడు పరిస్థితి చూడండి !
రైల్ తగలపెట్టడం : ఇంటలిజెన్స్ ముందే చెప్పింది ఇగ్నోర్డ్ .. ముందు ఒక జోకర్ నీపెట్టి , వెనక ఇంత జరిగేలా ప్లానింగ్ నడుస్తున్న కానీ ఏమి చెయ్యలేదు ... పోస్ట్ ఇష్యూ హ్యాండ్లింగ్ అయితే ఇంకా వరస్ట్ , వాళ్ళ ఆవిడని జుట్టు పట్టుకు లాక్కెళ్లారు , కూతురిని కొట్టారు అనేవి , గ్రామాలు లాక్ చేసారు అంటూ  ఆ రెండు జిల్లాలో ఎంత నెగటివిటీ మూట కట్టకున్నారంటే ఆంత.. పీకే కి  వేసేవాళ్ళు కూడా ఈ నెగటివిటీ తో " నిజం గానే ఇక్కడ వేస్తే వాళ్లకి మల్లి వేసినట్టేనా " అని నమ్మి అన్నకి వేసేలా జరిగింది ఎట్లీస్ట్ 6-7% 
ఆఖరిది అమ్మ నాన్నల్ని చంపిన ఒక నేరస్థుడ్ని రాజు గారు అడిగారట " నీ మీద జాలి చూపించి శిక్ష వేయద్దు అంటున్నవ్ ..ఏ కారణం చేత ? " అంటే అతను " అమ్మ నాన్న లేని అనాదని రాజా  ...అందుకే " అన్నాడట . ఇది జరుగుతుంటే మొదటి రోజే క్లియర్ గ చెప్పారు తర్వాత ప్రాసెస్ ఆంతా జరుగుద్ది  ఎలాగో  కానీ ఈ వెర్షన్ వెంటనే చెప్పక పోతే "మీరే చేయించారు " అని తప్పుడు వెర్షన్ వ్యాప్తి చేసి సింపతీ ప్లానింగ్ ఉంది అని...కానీ నథింగ్ డన్ ! వెరీ వెరీ వెరీ ఇనెఫిసిఎంట్లీ హ్యాండల్డ్ .
ఇలా చాలా ఉన్నాయ్ ! ఐ నో చిన్నపటి నుంచి ఇచ్చిన ఇమేజ్ అండ్  మా ర్కెట్టింగ్ ని పూర్తిగా తప్పు అని నమ్మాలంటే చాలా కష్టమే 😊 ... కానీ ..వాస్తవానికి ఒక పెద్ద కోటరీ , రాజ గురువులు ,  కలిసొచ్చిన కాలం , వేరే వాళ్ళ  ఓట్లు . టైం - ఐటీ  వస్తున్న , జడ్జీల నియామక  , మీడియా ఛానల్స్  వస్తున్న టైం లో అదికారం లో ఉండటం బాగ  కలిసి వచ్చి .... పైన చెప్పిన వాటిలో దేనిలో " నీ వల్లే" అని బ్లేమ్ రాకుండా చూసుకోవటం గ్రేట్ ! 
నా  ఆప్షన్  కూడా ఆయనే  ఇపుడు ఉన్న రెండు ఒప్షన్స్ లో ఎవరు వైపు నువ్వు అంటే .. ఒబివియస్గ  45 ఇయర్స్  ఇండస్ట్రీ  వైపే 😊 ..జస్ట్ ఒక హానెస్ట్ ఏనాలిసిస్ అంతే !